భూపాలపల్లి జిల్లా కేంద్రంలో టీబీజీకేఎస్, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా, రాస్తారోకో చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పాల్గొన్నారు. మెడికల్ బోర్డు పునరుద్ధరించి డిపెండెంట్ కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి ఉన్న 50 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు.