
వడ్డీరేట్లలో మార్పు లేదు: ఆర్బీఐ గవర్నర్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం తెలిపారు. రెపో రేటు 5.25% వద్దే కొనసాగుతుంది. ఇది 2026-27 ఆర్థిక సంవత్సరానికి RBI నిర్వహించిన తొలి ద్వైమాసిక సమీక్ష. గత ఫిబ్రవరి సమీక్షలో కూడా వడ్డీరేట్లలో మార్పు చేయలేదు. అయితే, గత ఏడాదిలో RBI పలుమార్లు వడ్డీరేట్లను తగ్గించింది, మొత్తం రెపో రేటు 1.25% వరకు తగ్గింది.




