రైతు దంపతుల మృతి.. షోకాజ్ నోటీసులు

1చూసినవారు
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లిలో పంట వ్యర్థాలు దహనం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో రైతు చాగల్ల చంద్రమౌళి (62), ఆయన భార్య భాగ్యమ్మ (55) మృతి చెందారు. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ సంచాలకుడు గోపి, జిల్లా వ్యవసాయ అధికారి, భూపాలపల్లి సహాయ వ్యవసాయ సంచాలకుడు, రేగొండ మండల వ్యవసాయ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పంట వ్యర్థాల దహనాన్ని నిరోధించాలని నిరంతరం ఆదేశాలు ఇస్తున్నప్పటికీ, నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సంజాయిషీ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్