
ఖర్గేకు మసాజ్ చేసిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్
పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భుజం నొప్పితో బాధపడుతుండగా, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఆయనకు మసాజ్ చేశారు. రాహుల్ సోదరి, ఎంపీ ప్రియాంక గాంధీ కూడా అక్కడే ఉన్నారు. నొప్పి ఉన్నప్పుడు ఇలా చేయాలని ప్రియాంక ఖర్గేకు చెబుతున్నట్లుగా కనిపించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.




