జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామంలోని శ్రీ ఉమా మహేశ్వర ఆలయంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాల కోసం పూజా సామాగ్రిని అక్కపెల్లి మల్లయ్య రాజేశ్వరి, అక్కపెల్లి రామకృష్ణ సంధ్యారాణి దంపతులు శనివారం అందజేశారు. ఆలయ అర్చకులు కిషన్ శర్మ పూజలు నిర్వహించి దంపతులను ఆశీర్వదించారు. ఉత్సవ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్ దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.