జూకల్ గ్రామానికి చెందిన మాశబోయిన రాజయ్య (65) చల్లగరిగ గ్రామ శివారులో కౌలుకు తీసుకున్న పొలంలో మక్కజొన్న చొప్ప పనులకు వెళ్లారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అస్వస్థతకు గురై చెట్టు కింద స్పృహతప్పి పడిపోయారు. స్థానికులు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతుడి కుమారుడు రాజేందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.