గుడుంబా స్వాధీనం: ఒకరిపై కేసు నమోదు

1025చూసినవారు
గుడుంబా స్వాధీనం: ఒకరిపై కేసు నమోదు
భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పంగిడిపల్లి శివారులో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో 10 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. చిట్యాల మండలం అందుకుతండ గ్రామానికి చెందిన బుఖ్య వీరన్న అనే వ్యక్తి అక్రమంగా గుడుంబా నిల్వ ఉంచినట్లు గుర్తించి, అతనిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై అమూల్య మాట్లాడుతూ, అక్రమ మద్యం తయారీ, విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజానికి ముప్పుగా మారిన ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్