BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతులను గుండె ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రాబోయే రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ రాజ్యం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతు సంగ్రామ సదస్సులో రైతుల పక్షాన కేటీఆర్ నాలుగు తీర్మానాలు ప్రకటించారు. కాంగ్రెస్ పాలన వల్ల బలైన రైతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని, రైతు డిక్లరేషన్లోని హామీలు అమలు చేయాలని, అన్ని పంటలను ఆంక్షలు లేకుండా కొనాలని, రైతు బంధు, రుణమాఫీ, బోనస్, రైతు భీమా పథకాలు పూర్తిగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.