ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు

4చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు
చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద ద్విచక్ర వాహనం పోలీసు వాహనాన్ని వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. భూపాలపల్లి వైపు వెళ్తున్న మొగుళ్ళపల్లి మండల పోలీస్ వాహనాన్ని, చిట్యాల పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ లలిత తన ఇద్దరు కొడుకులతో కలిసి కోటర్స్‌కు వెళ్తుండగా వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొంది. వెంటనే వారిని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం అందిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో లలిత భర్త ఆర్మీ చర్ల మల్లేష్‌కు 274 రీడింగ్ వచ్చినట్లు మొగులపల్లి ఎస్సై అశోక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్