పాలంపేటలోని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయాన్ని సినీనటుడు బండారు మాణిక్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్ గొరంట్ల విజయ్‌కుమార్ ఆలయ చరిత్ర, కాకతీయుల శిల్పకళ విశిష్టతను వివరించారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని ఆసక్తిగా వీక్షించారు.