అనారోగ్య సమస్యలతో మరణించిన భూపాలపల్లి హోంగార్డు రంజిత్ కుటుంబానికి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మనోధైర్యం నింపారు. రంజిత్ మృతదేహానికి ఎస్పీ పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.