భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో జాతీయ రహదారి సమీపంలోని అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్ద అటవీ మంటలు చెలరేగాయి. అధికారులు స్పందించలేదని, అటవీశాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో విలువైన అటవీ సంపద అగ్నికి ఆహుతి అయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెక్‌పోస్ట్ సమీపంలోనే ఈ ఘటన జరగడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.