భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి గంగ వాటర్ ఫిల్టర్ బెడ్‌ను సోమవారం పరిశీలించి, సింగరేణి కార్మికులకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులున్నాయని తెలిపారు. స్థానికులు, కార్మికులు, కౌన్సిలర్లు తమ దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావడంతో ఫిల్టర్ బెడ్‌ను సందర్శించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న మోటార్లు చాలా పాతవి కావడంతో కొన్ని పనిచేయడం, మరికొన్ని రిపేరులో ఉండటంతో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని ఆయన వివరించారు.