భూపాలపల్లి జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి గ్రామంలో జరిగిన మినీ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. ఆయన వనదేవతల దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జాతర నిర్వహణ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గండ్ర దంపతులను ఘనంగా స్వాగతించారు. ఈ జాతరలో ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.