ఉమ్మడి వరంగల్ జిల్లా, భూపాలపల్లికి చెందిన బొమ్మెల పోషాలు అనే బుర్రకథ కళాకారుడు ఉత్తమ బుర్రకథ కళాకారుడిగా సోమవారం స్వర్ణ నంది అవార్డు అందుకున్నారు. మెగా ఈవెంట్-2026లో భాగంగా కీర్తి ఐకాన్ వారిచే నిర్వహించిన కార్యక్రమంలో ఐపీఎస్ రత్న చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. పోషాలు ప్రతిభకు దక్కిన ఈ గుర్తింపుతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.