కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు తీర్పు వాయిదా

9చూసినవారు
కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు తీర్పు వాయిదా
భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అంశంలో హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ నెల 22వ తేదీన తుది తీర్పు వెల్లడించనుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్, హరీశ్‌రావు, స్మితా సబర్వాల్, ఎస్‌కే జోషి వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వు చేసిన ఉన్నత న్యాయస్థానం మరోసారి తీర్పు వెలువరించడాన్ని వాయిదా వేసింది.