జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రూపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మోతే తిరుపతిరెడ్డి, రావుల రవి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వారిని
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి శనివారం పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆమె వెంట పార్టీ నాయకులు, సర్పంచ్, కార్యకర్తలు పాల్గొన్నారు.