గుడుంబా తయారి పై కొయ్యూరు పోలీసుల దాడులు

3చూసినవారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్హర్ రావు మండలంలో కొయ్యూరు పోలీసులు అక్రమ గుడుంబాపై మెరుపు దాడి నిర్వహించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు కొండంపేట గ్రామంలో జరిగిన ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 650 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొయ్యూరు ఎస్సై నరేష్ తెలిపారు. అక్రమ గుడుంబాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్