ఉమ్మడి వరంగల్ జిల్లా, భూపాలపల్లిలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు, జెన్‌కో, సింగరేణి సంస్థలకు సంబంధించిన భూసేకరణ పురోగతిపై ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్షించారు. భూసేకరణ ప్రక్రియతో పాటు నిర్వాసితులకు పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీలను నిబంధనల ప్రకారం సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణలో ఉన్న అభ్యంతరాలు, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి, శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని సూచించారు. భూసేకరణ పూర్తైన వెంటనే సంబంధిత శాఖలకు భూములు అప్పగించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.