పశుపోషకులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

13చూసినవారు
పశుపోషకులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో పశువుల దాహార్తిని తీర్చేందుకు VBG RAM-G పథకం కింద నీటి తొట్టెల నిర్మాణానికి అవకాశం కల్పిస్తున్నట్లు మండల పశువైద్యాధికారి డా. జి. రమేష్ తెలిపారు. అర్హులైన రైతులు, పశుపోషకులు గ్రామ పంచాయతీ ద్వారా దరఖాస్తు చేసుకుని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ పథకం ద్వారా పశువులకు ఎల్లప్పుడూ తాగునీరు అందుబాటులో ఉండటమే కాకుండా, వేసవిలో నీటి కొరత సమస్య తగ్గుతుంది. పశువుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పశుపోషకులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. తమ గ్రామాల్లో నీటి తొట్టెల ఏర్పాటుకు గ్రామసభల్లో ప్రతిపాదనలు చేయాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్