జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని నాగ వీధిలో ఆదివారం రాత్రి నాగా యూత్ ఆధ్వర్యంలో గణనాథుని వద్ద మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దాతల సహకారంతో భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. యూత్ లీడర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు.