ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Apr 11, 2026, 14:04 IST/

పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు.. స్టాండప్ కమెడియన్‌ అనుదీప్‌కు జనసేన హెచ్చరిక

Apr 11, 2026, 14:04 IST
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి స్టాండప్ కమెడియన్ అనుదీప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం SMలో వైరల్ అవుతున్నాయి. తన ప్రదర్శన సందర్భంగా పవన్ పెళ్లిళ్లు, విడాకుల అంశాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలోనే అనుదీప్ వ్యాఖ్యలపై జనసేన నేత సందీప్ పంచకర్ల స్పందించారు. మహిళలను ద్వేషించడం, దూషణలు స్టాండ్ అప్ కామెడీ కాదన్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, వారి కుటుంబసభ్యులపైనా చేసిన వ్యాఖ్యలకు గాను అనుదీప్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.