
నీట్ రీఎగ్జామ్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
జూన్ 21న జరగబోయే నీట్ పున:పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించాలనే పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పరీక్షను యథాతథంగా OMR విధానంలోనే నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పరీక్షా విధానాన్ని అకస్మాత్తుగా మార్చడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదని, సమయాభావం, ఎన్టీఏపై ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు పేర్కొంది.




