భూపాలపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 11వ వార్డు (వేషాలపల్లి & పెద్దకుంటపల్లి) లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి గిట్టుబాటు ధర పొందాలని ఆయన రైతులకు సూచించారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, నాయకులు పాల్గొన్నారు.