భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నేడు సోమవారం గోరికొత్తపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఆయన ముందుగా సుల్తాన్ పూర్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు, న్యూ జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం వెంకటేశ్వర్లపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన, గోరి కొత్తపల్లిలో సీసీ రోడ్లు, అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొంటారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.