ఉమ్మడి వరంగల్ జిల్లా, భూపాలపల్లి మండలంలోని రమణక్కపేటతో పాటు పలు గ్రామాల్లోని అంతర్గత రోడ్లు భారీ వర్షానికి బురదమయంగా మారాయి. ప్రజలు నడవలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. అధికారులు, నాయకులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయడంతో పాటు సిసి రోడ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.