గోరి కొత్తపల్లిలో జాతీయ ఐక్యత దినోత్సవం

4చూసినవారు
గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో జాతీయ ఐక్యత దినోత్సవం, సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మండల ఎస్సై సాకాపురం దివ్య, పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై దివ్య 2K రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. సర్దార్ వల్లభాయి పటేల్ జాతీయ సమగ్రతకు నిలువెత్తు నిదర్శనం అని, స్వతంత్ర భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్