నదిమాతకు నవరత్న మాల హారతి

2చూసినవారు
కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాల్లో భాగంగా జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద నదీ మాతకు 'నవరత్నమాల హారతి' కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. కాశీ వేదపండితులు సమర్పించిన ఈ విశేష హారతిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో వీక్షించారు. అనంతరం త్రివేణి సంగమంలో ప్రత్యేకంగా తయారు చేసిన హంస వాహనంలో స్వామి వారి తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన వాహనం భక్తులను ఆకట్టుకుంది, శివనామస్మరణలతో తీరం మార్మోగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్