భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రంలో సరస్వతి అంత్య పుష్కరాలు పదవ రోజుకు చేరుకున్నాయి. ప్రాణహిత, సరస్వతి, గోదావరి నదుల త్రివేణి సంగమం వద్ద భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. పుష్కరాల ముగింపు దశకు రావడంతో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సంగమ స్థలంలో పవిత్ర స్నానాలు ఆచరించి, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం భక్తులు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. క్షేత్రమంతా భక్తిభావంతో మార్మోగుతోంది.