భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రాఘవరెడ్డి పేట గ్రామ శివారులో ఇందుర్తి గ్రామానికి చెందిన రాజయ్య అనే వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమైంది. రాజయ్య కొంతకాలంగా రాఘవరెడ్డిపేటలో నివాసముంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గొర్రెలను కాస్తున్న కాపరులకు తీవ్రమైన దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్సై అమూల్య ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.