అభం శుభం తెలియని చిన్నారి జీవితం నాలుగేళ్లకే ముగిసింది. ఆడుతూ పాడుతూ జీవితం గడుపుతున్న చిన్నారిని మృత్యువు కబళించింది. భూపాలపల్లి రేగొండకు చెందిన శ్రీకాంత్-రమ్య దంపతుల కుమార్తె దక్షుణ్య శుక్రవారం ఒక్క సారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కాగా, తల్లిదండ్రులు ప్రైవేట్ హాస్పిటల్ కు అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.