అకాల వర్షం తడిసిన వరి ధాన్యం

9చూసినవారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కల్లాలలో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. వాతావరణంలో ఆకస్మిక మార్పుల కారణంగా కురిసిన ఈ వర్షంతో, రైతులు కవర్లు కప్పినప్పటికీ పలుచోట్ల నీరు నిలిచి ధాన్యం దెబ్బతింది. మల్హర్ మండలం తాడిచెర్ల కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొట్టుకుపోయినట్లు సమాచారం. రైతులు తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్