సహజానంద స్వాముల సప్తాహ కార్యక్రమం: భక్తి స్మరణతో మహిళల పాటలు

594చూసినవారు
ఉమ్మడి వరంగల్ జిల్లా, భూపాలపల్లిలోని గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని గురుదేవ ఆశ్రమంలో సహజానంద స్వాముల ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు అఖండ శివనామ సప్తాహ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు, భక్తులు 'శివాయ నమః ఓం' స్మరణతో పాటలు పాడారు. శ్రీశ్రీశ్రీ సహజానంద స్వామి మాట్లాడుతూ, కర్తృత్వ భావమే బంధమని, కార్యం కాదని, నిశ్చలంగా ఉండి 'నేను భగవంతుడిని' అన్న ఎరుక కలిగి ఉండాలని తెలిపారు. ఇక్కడ నిశ్చలత్వమంటే పృథక్భావం ఏమాత్రమూ లేని పరిపూర్ణ శరణాగతి అని వివరించారు.

సంబంధిత పోస్ట్