కొనసాగుతున్న సరస్వతీ అంత్య పుష్క రాలు

1చూసినవారు
కాళేశ్వరాలయంలో కాశివేద పండితులతో స్వామి వారికి ప్రత్యేకంగా కర్పూర హారతి కార్యక్రమం నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు త్రివేణి స్నానాలను ఆచరించారు. నదిలో పూజలు చేసి, దీపాలను వదిలారు. పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. జ్ఞానసరస్వతి ఘాట్ వద్ద ఉన్న సరస్వతి అమ్మవారికి పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్