నిబంధనలు మీరితే ఇసుక ట్రాక్టర్ల సీజ్: ఎస్సై సతీష్ హెచ్చరిక

6చూసినవారు
నిబంధనలు మీరితే ఇసుక ట్రాక్టర్ల సీజ్: ఎస్సై సతీష్ హెచ్చరిక
మానేరు, చలి వాగుల నుండి ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి ఇసుక రవాణా చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని చిట్యాల ఎస్సై పోచంపల్లి సతీష్ హెచ్చరించారు. ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతి ఉందని, ఇందిరమ్మ కూపన్లు, ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్‌ను తహసీల్దార్ కార్యాలయంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ట్రాక్టర్ ఇసుక ధరల కంటే అధికంగా వసూలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్