భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సమక్షంలో, భూపాలపల్లి మండలం రామ్ నాయక్ తండా గ్రామ వాస్తవ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోరిక అమృ నాయక్, తనతో పాటు మరికొందరు నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత ప్రభుత్వం చేసిన పనులు, ముఖ్యంగా రామ్ నాయక్ తండాను ప్రత్యేక గ్రామ పంచాయతీగా కేటాయించడం వంటి కేసీఆర్ చేసిన పనులు, పథకాలు చాలా బాగున్నాయని ఆయన తెలిపారు.