మేడారం దర్శనం నుంచి వస్తుండగా లారీ ఢీ, పలువురికి గాయాలు

2చూసినవారు
మేడారం దర్శనం నుంచి వస్తుండగా లారీ ఢీ, పలువురికి గాయాలు
భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండల కేంద్రానికి సమీపంలోని కుదురుపల్లి గ్రామం దగ్గర గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడారం జాతరకు వెళ్లి దర్శనం చేసుకుని బులోరా వాహనంలో స్వగ్రామానికి తిరిగి వస్తున్న గౌరీ బాయ్, వసంత్, రాజ్‌కుమార్‌తో పాటు కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. వాహనంలో ఉన్న పలువురికి తీవ్ర గాయాలు కాగా, సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది వేగంగా స్పందించి, గాయపడిన వారిని భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.