భూపాలపల్లి RTC డిపో పరిధిలోని బస్సుల రాకపోకలు, సమయాలు, రూట్ల వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఎంక్వయిరీ నంబర్ 7382854256ను డిపో మేనేజర్ చేరాల మురళీకృష్ణ నేటి నుంచి అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులకు వేగంగా సమాచారం అందించేందుకే ఈ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ నంబర్‌కు ఫోన్ చేసి ప్రయాణికులు తమకు కావాల్సిన వివరాలను తెలుసుకోవచ్చు.