గ్రామ దేవతలకు భవానీ సహిత గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

1055చూసినవారు
గ్రామ దేవతలకు భవానీ సహిత గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
ఉమ్మడి వరంగల్ జిల్లా, భూపాలపల్లిలో ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం శుద్ధ త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి నెల నిర్వహించే పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు నాగరాజు గ్రామ దేవతలను పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, పట్టు వస్త్రాలతో అలంకరించి పూజలు చేశారు. ఈ కార్యక్రమం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది.

సంబంధిత పోస్ట్