పదవ తరగతి ఫలితాల్లో చిట్యాల మండలం లోని టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కాలేజీ బాలికలు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. అదే గురుకులానికి చెందిన డి. శ్రీజ 550/600 మార్కులతో మండల టాపర్ గా నిలిచింది. గురుకులంలో మొత్తం 77 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ గోల్కొండ బిక్షపతి తెలిపారు. ఈ సందర్భంగా మండలవాసులు విద్యార్థినులను అభినందించారు.