విద్యార్థిని అస్వస్థత... స్పందించిన కలెక్టర్

15చూసినవారు
విద్యార్థిని అస్వస్థత... స్పందించిన కలెక్టర్
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ జడ్పీ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలకు చెందిన కీర్తన అనే విద్యార్థిని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ, తీవ్ర నీరసంతో కనిపించడంతో కలెక్టర్ ఆమె పరిస్థితిని గమనించారు. వెంటనే స్పందించి, తన వ్యక్తిగత సిబ్బందితో పాటు బాలికను తన అధికారిక వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ సంఘటన కలెక్టర్ యొక్క మానవతా దృక్పథాన్ని చాటింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్