జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం, కోటగుళ్లలో గల శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయాన్ని మంగళవారం ఫ్రాన్స్ దేశస్థులు ఎరిఫ్, ఎలిక్ సందర్శించారు. వారు స్వామివారికి పూజలు చేసి, ఆలయ పరిసరాలను ఫోటోలు, వీడియోలు తీశారు. ఆలయ నిర్మాణం అద్భుతమని కొనియాడుతూ, అర్చకులు నాగరాజును కోటగుళ్ల చరిత్ర గురించి అడిగి తెలుసుకున్నారు.