పగలంతా ఎండకు, వడగాల్పులకు అలసిపోయి సాయంత్రం చల్లగాలికి విశ్రాంతి తీసుకునేవారి ఇళ్లల్లో దొంగలు పడుతున్నారని టేకుమట్ల ఎస్సై అమూల్య తెలిపారు. పగటిపూట రెక్కీ నిర్వహించి, తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, సాయంత్రం లైట్లు వెలగని ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.