42కు పైగా పాత చోరీ కేసులు ఉన్న దొంగ అరెస్ట్

2చూసినవారు
42కు పైగా పాత చోరీ కేసులు ఉన్న దొంగ అరెస్ట్
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పార్లపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన ఇళ్లలో, ద్విచక్రవాహనాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన అంతరాష్ట్ర దొంగ దాసరి మురళీకృష్ణను అరెస్ట్ చేసి, చోరీకి గురైన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై తెలుగు రాష్ట్రాల్లో 42కు పైగా పాత చోరీ కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది. ముఠాలోని మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని చిట్యాల సీఐ మల్లేశ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్