భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. శుభానంద అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం వారికి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.