పిడిసిల్ల శివాలయంలో రెండు ఇన్వర్టర్ బ్యాటరీల చోరీ

1778చూసినవారు
పిడిసిల్ల శివాలయంలో రెండు ఇన్వర్టర్ బ్యాటరీల చోరీ
భూపాలపల్లిలోని మొగుళ్లపల్లి మండలంలోని పిడిసిల్ల గ్రామ శివాలయంలో రెండు ఇన్వర్టర్ బ్యాటరీలు చోరీకి గురయ్యాయి. జూన్ 25న రిపేర్ చేయించి ఆలయ ఆవరణలో ఉంచిన బ్యాటరీలు, జూన్ 28న ఉదయానికి కనిపించకుండా పోయాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు కట్కూరి సునీల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగిలించబడిన బ్యాటరీల విలువ సుమారు రూ. 20,000 ఉంటుందని సమాచారం. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఎం. సురేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్