మహాదేవపూర్ మండలంలోని మహదేవపూర్, సూరారం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం పరిస్థితిని స్వయంగా పరిశీలించి, రైతులతో మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా, తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, తక్షణమే కాటారంలోని అన్నపూర్ణ పారబాయిల్ రైస్ మిల్ తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.