ఉమ్మడి వరంగల్ జిల్లా, భూపాలపల్లిలోని ఘనపురం మండల కేంద్రంలో ఇటీవల మరణించిన మోర కొమురమ్మ గారి కుటుంబానికి ఆది జాంబవ యూత్ అసోసియేషన్ తరపున 50 కిలోల బియ్యం గురువారం బట్వాడా చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు జన్ను పవన్ కల్యాణ్, గౌరవ అధ్యక్షులు సామర్ల నాగరాజు, సలహాదారు మంద మహేష్, కోశాధికారి చిలువేరు విద్యాసాగర్, మరియు పలువురు సభ్యులు పాల్గొన్నారు. మృతుల కుటుంబాలకు యూత్ అసోసియేషన్ చేయూత అందించింది.