తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పట్టణంలోని షటిల్ కోర్టు వద్ద యువతతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో యువత పాత్ర కీలకమని, క్రీడలు శారీరక ఆరోగ్యం, మానసిక ఉత్సాహం పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. యువత క్రీడల అభివృద్ధిపై దృష్టి సారించి, తమ ప్రతిభను మెరుగుపర్చుకోవాలని సూచించారు.