ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం

1చూసినవారు
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాల్య తండా గ్రామానికి చెందిన బాణోత్ శ్రవణ్ కు చెందిన 5 ఎకరాల గడ్డి వాము బుధవారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు లక్షా యాభై వేల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ సకాలంలో రాకపోవడంతో గడ్డి వాము పూర్తిగా కాలిపోయింది.

సంబంధిత పోస్ట్